బీటల శిల్పం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.-ఎం. ఏ (ఇంగ్లీష్ ); డి. ఎడ్.
కొన్ని అలలు సముద్రాన్ని కల్లోలం చేస్తాయి.
కొన్ని బంధాలు బతుకుని చీల్చేస్తాయి.

నీ చేతి గాయం—
హృదయాగ్నిలో కాలిపోతుంది.
పగిలిన కలల గట్టు,
మాటలతో ఎన్నటికీ పూడ్చలేదు.

నమ్మకాలు—
కూలిన గోడలై, 
మళ్లీ లేవవు.

నిశ్శబ్దంలో రోదనలు,
చీకటిలో మూగ గాథలై!!
నేలకొరిగిన క్షణంలో,
నీ యాత్ర ఆగిపోతుంది.

జీవన రేఖలు —
మసక నీడలు, మరచిన జ్ఞాపకాలు.

నేను ఒక బీటల శిల్పం.
నీవు ముగిసిన కథల సమాధి"
________


కామెంట్‌లు