ఎందుకంటె "లైఫ్‌ఈజ్ బ్యూటిఫుల్‌" కదా!!:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.-ఎం. ఏ (ఇంగ్లీష్ ) & డి. ఎడ్.

(అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం నేడు)
=============================
పొద్దుటే నిద్దురలేపే కోడి 
కూతంటే నాకిష్టం...
ఎందుకంటె "లైఫ్‌ ఈజ్ 
బ్యూటిఫుల్" కదా!!

నిద్దుర లేచి నమిలే వేప చేదంటే  నాకిష్టం ...
ఎందుకంటె "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" కదా!!

అమ్మ చేతి సత్తు గిలాస ఛాయ్ నాకిష్టం ...
ఎందుకంటే "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" కదా!!

అమ్మమ్మ అరిటాకులో పెట్టె ఇడ్డేన్లు నాకిష్టం ...
ఎందుకంటె "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" కదా!!

నాన్నమ్మ చేసే నాటుకోడి పులుసు నాకిష్టం ...
ఎందుకంటె "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" కదా!!

సాయంత్రం నాన్న తో నడక నాకిష్టం...
ఎందుకంటె "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" కదా!!

తాతయ్య చెప్పే తోటరాముడి కథలంటే నాకిష్టం ...
ఎందుకంటె "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" కదా!!

దోస్తులతో దాగుడుమూత ఆటంటే  నాకిష్టం...
ఎందుకంటె "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్"కదా!!

చెల్లి, తమ్ముడు తో కలిసి మిద్దె పై నిద్దరోడము నాకిష్టం ...
ఎందుకంటె "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్"కదా!!

వానలో పకోడీ,వేసవిలో మామిడి,చలిలో చగోడి అంటే నాకెంతో ఇష్టం..!!ఇంకా..!!??

మామ దగ్గర గారాలు,అత్తమ్మ చేసే గారెలు...
అన్నయ్యలతో అలకలు,ఒదినమ్మల వత్తాసులు...
బావలతో సరదాలు,మరదళ్ళతో ముచ్చట్లు...ఇలా

అన్నీ బంధాలతో ఉన్న "మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" కదా!!
________

కామెంట్‌లు