పర్యావరణ గీతం:- -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
 ప:
పరిసరాలలో పచ్చదనం
పెంచుచుండును ఆహ్లాదం
పయనించెడి ఆ చల్లని పవనం
అనుగ్రహించును ఆరోగ్యం
॥పరిసరాల॥
1చ:
నీటి కొలనులో నిండిన కలువలు
దీవెనలీయగ పరిమళించుగా…
ఇంటి ముందున్న పువ్వుల తోట
పరిమళములనే వెదజల్లునుగా…
॥పరిసరాల॥
2చ:
గుప్పున వదులును కర్మాగారం
నల్లని పొగలను నలుదిశలా…
నత్రజనిని గ్రహియించిన తరువులు
ప్రాణ వాయువును ఇచ్చునుగా…
॥పరిసరాల॥
3 చ:
పరిశుభ్రముగా గృహములనుంచిన
అనారోగ్యములు దరిచేరవుగా…
పరవశమందిన ప్రకృతికాంత
పకపక పకమని నవ్వునుగా…
॥పరిసరాల॥


కామెంట్‌లు