రాహుల్జీ ఆగ్రాలో ముసాఫిర్ విద్యాలయంలో ఆర్యసమాజంలో శిక్షణ పొందాడు.అరబ్బీ బాగానేర్చుకున్నాడు.డిబేట్స్ లో బాగా రాణించాడు. పైగా రకరకాల పేపర్లు చదవడంతో ,దేశభక్తి భావాలు అంకురించాయి.తను రాసిన లేఖ ముసాఫిర్ పత్రికలో పడటంతో తొలిసారి అద్భుతంగా అన్పించింది.అస్పృశ్యుల పురోగతికై విద్యార్థులు కృషిచేసేవారు. ఆసియాఖండయాత్రచేయాలనే కోరిక రోజురోజుకూ రాహుల్జీలో పెరగసాగింది. 1915 కల్లా ఉపన్యాసాలు ఇవ్వడంలో రాటుతేలాడు.లాహోర్ లో సంస్కృతంకోసం డి.ఎ.ఐ.కాలేజీలో చేరాడు.స్కాలర్షిప్ వచ్చింది.హాస్టల్ వంటవారికి చదువు చెప్పేవాడు.పంజాబ్ కి చెందిన తులసీరాం కెన్యా నుంచి సంస్కృత చదువుకోసం లాహోర్ వచ్చాడు.ఆరోజుల్లోనే బాలవితంతువుల దీనగాథలు విన్నాడు.అబార్షన్స్ చేయించే అమ్మ నాన్నల కాలం! పునర్వివాహం వారి దృష్టిలో పాపం!వైదిక మతప్రచారంకోసం చందాలు వసూలుచేస్తూ మిర్జాపూర్ చేరాడు.అక్కడ తొలిసారిహిందీ నవలలు చదివాడాయన!రాహుల్జీ దగ్గర గ్రామాలకు ఒంటెపై వెళ్లేవాడు .సింహళ బర్మీలిపిలో ఉన్న గ్రంథాలు చదివాడు.దేవనాగరిలిపిలో ఉన్న కచ్చాన్ వ్యాకరణం ద్వారా ఆరెండు లిపులను నేర్చాడు.కాన్పూర్ లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు రోగుల సేవజేశాడు.
ఆరోజుల్లో చంపారన్లో గాంధీజీ పేరు మారుమోగుతోంది.ఆయన జీవిత చరిత్ర ను పద్యాల్లోరాసి ప్రచారం చేయించాడు రాహుల్జీ.రౌలత్ చట్టం అమల్లోకి వచ్చింది.హిందూ మహమ్మదీయ భేదం లేకుండ అంతా లాహోర్ లో ఊరేగింపులో పాల్గొన్నారు.శాస్త్రి పరీక్షల లో రాహుల్ తో సహా అంతా ఫెయిలైనారు.న్యాయ మధ్యమపరీక్షలో ఫెయిల్ ఐనా మీమాంస పరీక్ష లోఫస్ట్ క్లాస్ లో పాసైనాడు.(సశేషం)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి