రాహుల్ సాంకృత్యాయన్ 13 అచ్యుతుని రాజ్యశ్రీ

 ఛప్రాలో పోలీసులు అత్యాచారాలు సహించలేక వారిపై దర్యాప్తు చేశాడు రాహుల్ లంచం ఇవ్వలేదని పోలీసులు ఒక వ్యక్తి అరచేతిపై మంచం కోడు పెట్టి మనుషుల చేత తొక్కించటం రుజువయింది అలా ఎన్నో కేసుల గురించి రిపోర్టు తయారుచేసి జిల్లా మేజిస్ట్రేట్ కు ఇచ్చిన ఫలితం శూన్యం తిరిగి యాత్రలకు బయలుదేరాడు రాహుల్ జిమీరట్ నుంచి ఎడ్ల బండి పై హస్తినాపురం పరీక్షత్గడ్ ప్రదేశాలు చూసి ఢిల్లీకి వెళ్ళాడు ఆ తర్వాత లాహోర్ లో ఆర్య సమాజా సభలో పాల్గొన్నారు విదేశాలకి వెళ్ళటానికి పాస్పోర్టు ఇవ్వలేదు లడక్ యాత్ర కు అనుమతి దొరికింది అక్కడ లామా ఆశ్రయంలో ఉన్నాడు రాహుల్ జీ ఒక చిన్న కుర్రవాడి బొటనవేల్పై కాటుక చుక్క పెట్టి దీనిలో నీ ప్రతిబింబాన్ని చూడు అని చెప్పాడు ఆ కుర్రాడు బొంబాయి సముద్రం బోధగయ ఆ తరువాత తెలిసిన వారి తెలియని వారి పేర్లు వారి ఆకారాలు కూడా చెప్పటం లామాకు ఆశ్చర్యం కలిగించింది అక్కడి నుంచి రాహుల్ జి గుర్రంపై 18 వేలఅడుగుల ఎత్తున ఖర్దోంగ్ యాత్ర చేసి కాలినడకన కిందకి దిగడం ఓ విశేషం. టిబెట్ భాష సాహిత్యంగూర్చి లామాతో చర్చించారు.లడక్ లో స్త్రీ చాలామంది పురుషులని పెళ్లాడవచ్చు.భర్తలు దొరక్క పోతే ఇతర మతాలవారిని చేసుకోవటం చూసిన రాహుల్జీ ఒక భార్యకు ఒక భర్త మాత్రమే ఉండాలని సూచించారు.

కామెంట్‌లు