రాహుల్జీ టిబెట్ సరిహద్దులో ఉన్న మన్ పంగ్ గోంగ్ సరస్సు 50మైళ్ల వంకరటింకర గా ఉండి చేపలుండవు.శీతాకాలంలో నీరుగడ్డకడితే జనం నడిచివెళ్లేవారు.అక్కడ స్త్రీలు యాన్ పశువుల పాలు మజ్జిగ వెన్న తయారుచేసే తయారుచేసేవారు. మజ్జిగ మరగబెట్టి మంచుగడ్డ లాచేసి పేలపిండి కల్పి ఎండబెడ్తారు.దప్పిక తీరుస్తుంది. టిబెట్ లోని సుమ్నమ్ ప్రాంత మహిళల కంఠం శరీరాకృతి కిన్నెర లని గుర్తుచేస్తుంది. బౌద్ధ మతావలంబకులు. అన్న దమ్ములందరికీ ఒకేఒక భార్య.
1927లో లంకచేరిన ఆయన కొలంబో సమీపంలో విహారంలోచిన్న క్లాసుమొదలు పైర్లు పైక్లాసుదాకా సంస్కృతం చదవడం విశేషం.19నెలలు లంకలో ఉండిపుస్తక పఠనం చేశాడు.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లంకకు (నేడు శ్రీలంక) వెళ్తే అక్కడ ఉన్న సీత అశోక వనం ఇంకా చాల ప్రదేశాలు వివరించాడు.ఫ్రెంచ్ టిబెట్ భాషలు నేర్చుకున్నాడు.త్రిపిటకాచార్య అనే బిరుదు పొందాడు.1928 లో భారత్ తిరిగొచ్చాడు. లామా శిష్యులు,శిష్యురాళ్లు రాత్రిపూట ఒకే చోట పడుకోటం విచిత్రం.నేటి లివ్ ఇన్ రిలేషన్ షిప్ కాబోలు.రాహుల్జీ టిబెట్ లో15నెలలున్నాడు.టిబెట్ ప్రజలు ఏడాది రెండేళ్ల కోసారి స్నానం చేస్తారు.నెల రెండునెలలకోసారి తలకి నూనె రాస్తారు.అక్కడ భార్య భర్తలు తల్లీ కొడుకులనిపిస్తారు.టిబెట్ లో పెద్ద అన్న కు పెళ్లయితే తమ్ముళ్లకు కూడా భార్య యే! అందుకే భార్య పెద్దది. ఆడపిల్లలు కొందరు ఆజన్మబ్రహ్మచారిణులుగా, తల బోడి చేయించుకున్నారు.మఠంలో ఉండేవారు ఆస్త్రీలు.గృహస్థులు అతిధికి సత్తుపిండి మజ్జిగ కానుక గా ఇస్తారు.కంచరగాడిదలపై పయనం11వశతాబ్దిలో కట్టిన పురాతన మఠంలో నిద్ర. నర్ధంగ్ అనేచోట పుస్తకాల ముద్రణాలయం చూశాడు.టిబెట్ రాజధాని లాసాలో దలైలామా నివాసం ఎరుపురంగు ఉంది.సంస్కృతంలో తను రాసిన 15శ్లోకాల్ని ధోటియాభాషలో అనువాదం చేయించి దలైలామాకు అందజేశాడు. టిబెట్ లో డేపుంగ్ అనే విహారంలో7వేలమంది బౌద్ధ భిక్షువులుండేవారు.ఇక రాహుల్జీ వింత విషయాలు గమనించాడు.కొద్దిమంది 20శాతం చదువుకుంటే మిగతావారంతా పనిపాటలు చేసేవారు.మత్తుపదార్ధాలు సేవిస్తూ కత్తితో పోట్లాడుకునే రకాలు.నవంబర్ 22న లాసాలో పెద్ద ఉత్సవం చేస్తారు.అక్టోబర్ లో పశువుల్ని చంపి 8నెలలకోసం మాంసం సిద్ధంచేస్తారు. యాక్ తోక తెలుపురంగులో ఉంటుంది.అదే మనం వాడే చామరం!ఆలయాల్లో వాడతాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి