రాహుల్ సాంకృత్యాయన్ 17 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 రాహుల్జీ బర్మాలో బౌద్ధ విహారాలు చూశాడు.ఇక్కడ కూడా బౌద్ధ భిక్షువుల కీచులాటలు చూసి విస్తుపోయాడు. బర్మా స్త్రీలు కూడా చాలా స్వేచ్ఛాజీవులు. 
రాహుల్జీ జపాన్ పర్యటన లో14వ శతాబ్దంలో నిర్మించిన ఎన్నో కొయ్య చెక్క మందిరాలు చూశాడు.జపాన్ పూర్వరాజధాని క్యోటో లోని*హీగ్షీహోంగన్* మందిరమంతా చెక్క తో చేశారు.దేవదారు వృక్షాల దుంగలు ఈడ్చు రావటంకోసం వేలాది బౌద్ధ మహిళలు  తమ తలవెంట్రుకలు కత్తిరించి త్రాళ్లుగా పేనారు. వాటితో కొయ్య స్తంభాలు లాగుతూ ఆలయనిర్మాణం చేశారు. ఆజుట్టుత్రాళ్లు సురక్షితంగా ఉన్నాయని రాశారు రాహుల్జీ.జపాన్ లోని  నిట్టా గ్రామంలో ఒక పరిచయస్థుని ఇంట దిగారు రాహుల్జీ.అతనికి ఇంగ్లీష్ సంస్కృతం తెలుసు.అక్కడివారు హిమాలయాల నుండి దేవదారు మొక్కలు తెప్పించి ఇళ్లలో నాటేవారు. 10అడుగుల పొడవు మొక్కలను జపాన్ వీధుల్లో అమ్మేవారు
ఆనాటి జపాన్లో రైతుల కుటుంబాల్లో పెద్ద కొడుకే ఆస్తికి హక్కుదారు.అతనికే పెత్తనం.ఆడపిల్లలుకూడా ధనికుల ఇంట్లో చాకిరీచేసి పొట్ట పోసుకోవాల్సిందే!అక్కడ బడి కాలేజీల్లో దాదాపు అంతా బౌద్ధ భిక్షువులు.సంస్కృత ప్రొఫెసర్లు జపనీయులను కలిశారు రాహుల్జీ
కామెంట్‌లు