రాహుల్జీ కొరియా వెళ్లి రాజధాని సియోల్ లో బౌద్ధ విహారం చేరారు. కొరియా రైతుల ఇల్లు గడ్డి ఇల్లు అక్కడ దేవదారు వృక్షాలు బాగా ఉన్నాయి కొరియాలో ఎత్తయిన పర్వతం విర్హో!ఆయన పర్యటించిన ముఖ్య ప్రాంతాలు మంచూరియారాజధాని ముగ్డన్ లో బౌద్ధ విహారం లామా మందిరం.హర్బిన్ లో కూలీలుగా రష్యన్లు పనిచేస్తున్నారు.ఆపై మాస్కో,కాకసస్ పర్వతాలు అక్కడ స్త్రీలు పంజాబీ డ్రెస్ లో కనిపించారు.బాకూ ప్రాంతంలో జ్వాలాదేవిమందిరంలో శిలాశాసనాలు దేవనాగరిలిపిలో, గురుముఖి లిపిలో ఉన్నాయి రాహుల్జీ ఇరాన్ వెళ్లారు.అక్కడ ఆరోజుల్లోనే ఇంటింట ఇంకుడుగుంటలున్నాయి. నేషాపోర్ లో ముత్తయ్య ఉమర్ఖయ్యాంసమాధి, తూస్ లో మహాకవి పిరదౌసి సమాధి చూశారు.భారత్ కి తిరిగొచ్చి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ యాత్ర చేశారు.మజార్ లోప్రసిద్ధమైనవి
బాహ్లీకగుర్రాలు.ఒక గుర్రంని బండికి కడితే రెండో గుర్రం దానివెంటనడుస్తుంది. ఆరోజుల్లో కాబూల్ లో 400హిందూ కుటుంబాలు,హిందూ దేవాలయాలుండేవి. గజనీ మహ్మద్ కాలంలో వచ్చారంతా ఇక్కడికి.తులసీదాసుభజన్స్ పాడేవారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రాహుల్జీ భారతరాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.34ఏళ్లతర్వాత తనుపు పెరిగిన ఊర్లు తమ్ముళ్లు బంధువులను కలిశారాయన.1944లో ఆయన అఖిల భారత రైతుమహాసభకు విజయవాడ వచ్చారు.శ్రీ సంజీవదేవ్ గారు తుమ్మపూడి నివాసితో కల్సి కొన్ని ప్రాంతాలు తిరిగారు.ధాన్యకటకం గుంటూరు మాచర్ల నాగార్జున కొండ దర్శించారు.తెనాలికి దగ్గర ఉన్న దావులూరులో రైతుకూలీలసభలో ప్రసంగించారు.ఆతర్వాత 1948 లో హిమాచల్ ప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల దర్శించారు.1950లో తన 57వ ఏట కమలా పరియార్ ని పెళ్లాడారు.వారికి1953 లో జయ అనే కూతురు,1955లో జేత అనే కొడుకు పుట్టారు.డార్జిలింగ్ లో ఇల్లుకొనుక్కుని స్థిరపడ్డారు.1961 లో అనారోగ్యంతో బాధపడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. ఆయన గ్రంథాలు ప్రచురించిన సంస్థలు ఆదుకోలేదు. సోవియట్ ప్రభుత్వం ఆదుకుని మాస్కోలో శానిటోరియంలో ఉంచింది.7నెలలు పోరాటం సల్పి14ఏప్రిల్ 1963 లోతుదిశ్వాస విడిచారు డార్జిలింగ్ లో! ఆయన భార్య కమల ఆయన జ్ఞాపకార్థం ఒక చైత్యంని కట్టించారు.
(రేపు ఆఖరుభాగం)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి