రాహుల్ సాంకృత్యాయన్ 19:- అచ్యుతుని రాజ్యశ్రీ

 రాహుల్జీ టిబెట్ కి 4సార్లు యాత్రలు చేశారు.శ్రీలంక, ఇంగ్లాండ్,యూరప్ ,రష్యాలో పర్యటించిన తర్వాత  ఎన్నో గ్రంథాలు రాశారు.హిందీ లో 13 పుస్తకాలు రాశారు."దివోదాసు, ఓల్గాసే గంగ" ప్రాచుర్యం పొందాయి.ఆత్మ కథ 5సంపుటాలు, జీవిత గాథలు,యాత్రాగ్రంథాలు, నాటకాలు,వ్యాసాలు,టిబెటన్ భాషలో3 గ్రంథాలు ప్రచురించారు.సైన్స్,సోషల్,తత్వశాస్త్రం,మతం,నిఘంటువులు, జానపద సాహిత్యం,చరిత్ర, సంకలనాలు, అనువాదాలు,ఇలా ఎన్నో ఎన్నెన్నో!సంస్కృత గ్రంథాల  సంపాదకత్వం అనువాదాలు,పరిశోధన వెలువడిన పుస్తకాలు.దాదాపు అన్ని భారతీయ భాషల్లో ఆయన రచనలు అనువదింపబడినాయి.
ఆయన కి లభించిన బిరుదులు పురస్కారాలలో కొన్ని...మహాపండిత,త్రిపిటకాచార్య, సాహిత్య వాచస్పతి,డి.లిట్.  పద్మభూషణ్.ఆయన పుస్తకాలు 100 పేజీలు మొదలు వెయ్యిపేజీలదాకా 200పైగా పుస్తక రచన గావించారు.సంస్కృతం,పాళీ,టిబెటన్ భాషల్లో అందెవేసినచెయ్యి. 20భాషలు మాట్లాడే,రచనలు చేసే శక్తిగల మేధావి.తొలుత ఆర్యసమాజంలోచేరి,బౌద్ధ మతంవైపు ఆకర్షితుడైనాడు. ఆతర్వాత మార్క్సిజం వైపు మళ్లాడు. తొలుత కాంగ్రెస్ వాదిగా ఆపై కమ్యూనిస్టుగా మనదేశ ఉద్యమాల్లో పాల్గొన్నారు.ఓఅద్భుతవ్యక్తి గా చరిత్ర కారునిగా ఆయన చిరంజీవి.మరి నోబెల్ బహుమతి ఎందుకు రాలేదో!?14ఏప్రిల్ 1963 లో మనదేశం ఓగొప్ప రచయిత వేదాంతి యాత్రికుని కోల్పోయింది( సమాప్తం)🌷
కామెంట్‌లు