ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు 40 బెంచీలు అందజేత

 విశాఖ చారిటబుల్ ట్రస్ట్ వారు ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలకు 40 బెంచీలు అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు. ఆదివారం ఆయన పిల్లల కోసం ఊషన్నపల్లిలోని పాఠశాల తరగతి గదుల్లో బెంచీలను వేయించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పాఠశాల పిల్లలకు బెంచీలు లేకపోవడంతో వారు నేల మీద కూర్చుంటున్నారని, పిల్లలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలియజేస్తూ గౌరవ పెద్దపల్లి ఎంపీ, మాజీ ఎంపీ, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. పాఠశాల పిల్లల ఇబ్బందులను గమనించిన వారు పిల్లల సౌకర్యార్థం విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలకు 40 బెంచీలను ఉచితంగా పంపించారు. గతంలో శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాను పనిచేసిన సమయంలో ఈర్ల సమ్మయ్య పాఠశాల పిల్లల కోసం విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 30 బెంచీలు, రామగుండం ఎన్టిపిసి నుంచి రూ.40 వేల విలువైన డెస్క్ బెంచీలను తెప్పించారు. ఆ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. అడగ్గానే పిల్లల కోసం 40 బెంచీలు పంపించిన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర మంత్రి, గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఈర్ల సమ్మయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. 40 బెంచీలు మంజూరు చేయడంలో సహకారం అందించిన మిత్రులందరికీ ఆయన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల అందరిది. తనకు అందరూ సమానమేనని, పాఠశాల అభివృద్ధికి అన్ని పార్టీలు, వర్గాల సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కామెంట్‌లు