సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
===============
మీరే మా ప్రగతికి మెట్లు,
మీరే లేకపోతే ఎన్నో పాట్లు!
ఆకలిగా ఉన్నపుడూ —
సాపాటు భోజనం అందిస్తూ…
నీరసంగా ఉన్నపుడూ —
మీ ఫలరసాలతో ఉత్తేజాన్నిస్తూ…
శుభకార్యాల్లో మా గృహాలకు
మంగళతోరణాలై వెలుగుతూ...
నిత్యం సమస్యలతో పోరాడే మాకు —
"నేను ఉన్నాను" అనే ధైర్యాన్ని పంచుతూ,
సర్వకాల సర్వస్థితుల్లో
వెన్నంటి నిలుస్తూ…
చదివే సమయంలో
కాగితమై రూపాంతరం చెందుతూ…
ఎదిగే సమయంలో
ఒదిగే మనసు నేర్పుతూ…
పుట్టుకనుంచి గిట్టుట వరకు,
అన్నప్రాసన నుంచీ
ఆఖరి మజిలీ వరకూ —
చేదోడు వాదోడై మమేకమవుతూ…
వేడుక ఏదైనా…
వేదిక ఎక్కడైనా…
మమ్మల్ని నీడలా వెంటాడే
మీరే మా ప్రియ నేస్తాలు!
ఆపదల్లో ఆదుకునే అభయహస్తాలు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి