రాహుల్ సాంకృత్యాయన్7....అచ్యుతుని రాజ్యశ్రీ

 రాహుల్జీ కి ఒక బ్రహ్మచారితో పరిచయం కలిగింది.జమనోత్రి దగ్గర ఉన్న  పండాల అనే గ్రామంలో ఆగి ఆమర్నాడుయమున గట్టున ఉన్న కొయ్యవంతెన దాటాడు. జమనోత్రి తప్తకుండంలో ఆలుగడ్డ మూట వేసి తీయగానే చక్కగా ఉడికాయి. చిన్న చిన్న రొట్టెలు వేయగానే ఉడికాయి. అక్కడ నుంచి గంగోత్రికి పయనంఅంతా మంచుమయం!గంగోత్రిలో రోజూ ఎవరో ఒకరు ఆహారం పెట్టేవారు అక్కడ సాధువులు గంజాయి పీల్చేవారు. అక్కడే రాహుల్ కి జ్వరం వచ్చింది.పైగా ఆయన కంబళీని ఎవరో కాజేశారు.గౌరీకుండచేరాడు.నేపాల్ రాణీ దానాలు చేస్తున్న సంగతివిని దీనంగా ఆమె ముందు చేయిసాచాడు.అదే మొదలు అదే ఆఖరు అలా దానంకోసం చేయిసాచటం!ఆతర్వాత కేదారనాధ్ లో శ్రావణమాసంలో హిమకమలాలతో పూజ చేసేవారు.ఈయాత్రలన్నీ కాలినడకతోటే చేశాడు.తన యాత్రలో ఎంతోమందిని కల్సి చాలా విషయాలు తెలుసుకున్నాడు.బరేలీలో రాహుల్జీకి ఒకసన్యాసితో పరిచయం కలిగింది.ఆయన తనమనస్సు అటుఇటుపోతున్నప్పుడల్లా తన దగ్గర ఉన్న బెత్తంతో నేలపై కొట్టడం రాహుల్జీకి వింతగా అనిపించింది.సంస్కృతంలో ఉన్న  ఒక గ్రంథాన్ని రాహుల్ కి ఇచ్చాడు.అహింసను బోధించే పుస్తకమది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రాహుల్ ఎక్కడా ఉండలేదు.యాత్ర చేయాలి,కొత్త ప్రాంతాలు చూడాలనే అతని ఆశయం!కాశీ లో కొన్నాళ్లుండి సంస్కృతంలో పాండిత్యం సంపాదించాడు.మంత్రతంత్రాలపై ఆసక్తి పెరిగింది.వనమూలికలగూర్చిన  సంస్కృత గ్రంథాన్ని తొలిసారి రాహుల్ హిందీలోకి అనువాదం చేశారు.1912లో ఛప్రా రైలు స్టేషన్ నుంచి పర్సా మఠం చేరాడు.ఆయనని సాధువుగా మార్చారు.ఇత్తడి శంఖచక్రముద్రలు ఎర్రగా కాల్చి ఆయన బాహుమూలల్లో వేశారు.మఠంలో గుర్రాలున్నాయి. స్వామీ చేయడం నేర్చాడు.మఠం జమాఖర్చులు చూసే రాహుల్జీకి రైతుల దుస్థితి తెల్సివచ్చింది.కానీ చదువుకోటం తన ధ్యేయం కాబట్టి నిశబ్దంగా ఉండిపోయాడు
కామెంట్‌లు