రాహుల్ సాంకృత్యాయన్8:-అచ్యుతుని రాజ్యశ్రీ

 కొన్నాళ్లకు మఠం నుంచి కదిలాడు.కారణం"ప్రపంచపర్యటనచెయ్యి" అనే మాట పదేపదే మనసులోమెదలటమే!ఒక వకీలుతో పరిచయం కల్గటం,ఆయన దయవల్ల పూరీ,ఆపై మద్రాసు చూశాడు.స్త్రీల చీరకట్టు వింతగా అనిపించింది.ఇంకా ఆనాటి దక్షిణాది బ్రాహ్మణుల పద్ధతులు రాహుల్జీకి వింతగా అన్పించాయి. తిరుమశి లో ఉత్తరదేశంనుంచి వచ్చి స్థిరపడ్డ ప్రసన్నాచార్యుని కృపతో ఆయన ఇంట్లోనే ఉండి కావ్యనాటకాలు ఆపోశన పట్టాడు. అవన్నీ సంస్కృతంలోవే! ఇక్కడ అత్తగారు ఇంటిపనులన్నీ చేయటం,మనవరాలినే కోడలుగా చేసుకోవటం వింతగా అన్పించింది.దక్షిణాది బ్రాహ్మణులు విద్యావంతులై సుఖజీవనం గడపటం చూశాడు.కానీ ఉత్తరాదివారు మహమ్మదీయ పాలనలో పొలం పనులు చేయక తప్పిందికాదు. తిరుపతిలో 15రోజులు గడిపి అన్ని పూణ్యతీర్ధాలు సాధువు వేషంలో దర్శిస్తూ రామేశ్వరం చేరాడు.అక్కడ ఒక బ్రహ్మచారి కలిశాడు. పామన్ అతను ఉండే ప్రాంతం.ఎక్కువ జనాభా ముస్లింలే! రాహుల్ ఆబ్రహ్మచారి తో కల్సి ముస్లింల ఇంట ఉన్నాడు.వైద్యం చేసి అన్నిరోగాలు కుదిర్చే ,రోజుకి
  చేరాడు.ఇక్కడ కొత్త విషయం తెలిసింది.పామన్ లో బ్రహ్మ చారి భస్మచికిత్సతో  అన్నిరోగాలు కుదిర్చేవాడు కానీ గంజాయి పీల్చటం నచ్చక రాహుల్ అక్కడ నుంచి బయలుదేరి హంపి ఆపై ద్వారక కు బైలు దేరాడు. మధ్యలో డాకోర్ అనేప్రాంతంలో హోలీ సంబరాలు చూశాడు.జరాసంధుని చేతిలో ఓడిన కృష్ణుడు మధుర నుండి ద్వారక కు  పరుగెత్తాడని, రణఛోడ్ అనే పేరుతో కృష్ణుని నల్లని విగ్రహంని అక్కడ ప్రతిష్ఠించారని తెలుసుకుని ఆశ్చర్య పోయాడు.అక్కడ నుంచి  భోపాల్ బీనా కట్నీ ఆపై పర్సా మఠం చేరాడు.కానీ మఠం  మహంతి పద్ధతులు నచ్చటంలేదు. అతను లంచాలు తీసుకుంటూ అన్యాయాలు చేయడం చూసి పారిపోయి అయోధ్య చేరాడు( సశేషం)
కామెంట్‌లు