స్నేహ బంధం:-కందర్ప మూర్తి , హైదరాబాదు-: 8374540331

   సైబీరియా వంటి మంచు ప్రదేశాలలో ఉండే ఫ్లెమింగొ,
సిల్వర్ క్రేన్ లాంటి  విదేశీ పక్షులు  సమశీతోష్ణ వాతావరణం 
ఉండే  భారతదేశంలో వివిధ ప్రాంతాలకు  వేల కిలోమీటర్లు
ప్రయాణించి  అనువైన  ప్రదేశాలలో  గూళ్లు  నిర్మించుకుని
గుడ్లు  పొదిగి  పిల్లలవగానె  తమ  స్వస్థలాలకు  తిరిగి
ప్రయాణమవుతాయి.
    అటువంటి  విదేశీ  పక్షులకు  కొల్లేరు సరస్సు  కూడా
నివాశ ప్రాంతం. చక్కటి  వాతావరణంలో  విశాలంగా
విస్తరించి  పుష్కలంగా  నీటి  వనరులతో అనేక జల
చరాలు, పక్షులకు  ఆశ్రయం  కలిగిస్తోంది.
    కొల్లేరు సరస్సులో  ఒక ప్రాంతంలో దేశీయ తెల్ల కొంగలు,
నీటి కాకులు  ఇతర పక్షులు  నివాశముంటే  మరోవైపు
వలసవచ్చిన  సిల్వర్ క్రేన్,  ఫ్లెమింగొ వంటి  విదేశీ  పక్షులు
గట్లపైనున్న  దట్టమైన  చెట్ల కొమ్మల మీద గూళ్లు  కట్టుకుని 
ఆహ్లాదంగా  ఉంటాయి. వాటికి  ఇష్టమైన  ఆహారం  ఇక్కడ 
దొరుకుతుంది.
    కొల్లేరు సరస్సు  ఒక వైపున  నీటిలో నివశించే  తాబేలు 
పగలు  అక్కడ  ఉండే  బండరాయి మీద  కూర్చుని ఎండ
కాగుతుంటుంది.
       దగ్గరలో గట్టున  ఉన్న  చెట్టు కొమ్మ  మీద  విదేశీ  ఫ్లెమింగొ
(గూడ కొంగ) గూడు  కట్టుకుని  నివాశం ఉంటోంది. వీలున్నప్పుడు
రెండూ  కబుర్లు  చెప్పుకుంటూ  స్నేహితులయాయి.
    ఈ ప్రదేశంలో వాతావరణం బాగుంటుంది. రకరకాల జలచరాలు
తినడానికి  దొరుకుతాయి. మా నివాశ ప్రాంతం  ఎప్పుడూ మంచు
చలిగాలులతో  ఇబ్బందిగా ఉంటుంది. నీకు  ఏమైనా  చలచరాలు 
తినిపించాలంటె నువ్వు శాఖాహారివి. అందువల్ల  ఈ గట్టున ఉండె
 చెట్ల  రేగుపళ్లు, ఉసిరికాయలు, నేరెడు పళ్లు  నీకు  ఆహారంగా కోసి
పడేస్తానని  వివిధ రకాల  ఫలాలు  తాబేలుకు  తినిపించేది.
      ఎప్పుడూ నీటిలో  నాచు , ఆకులు, బండమీదున్న  పాకుడు
తినే  తాబేలుకు  ఫ్లెమింగొ  పడవేసే  పళ్లు ఎంతో రుచిగా ఉండేవి.
       ఇలా రోజులు గడుస్తున్నాయి. ఫ్లెమింగొ పక్షి  గర్భం  ధరించి
గుడ్లు పెట్టి  పొదిగి  పిల్లల్ని  చేసింది. పక్షి పిల్లలు  ఎదిగి  పెద్దవిగా
అవుతున్నాయి.
       ఒకరోజు  తల్లి  ఫ్లెమింగొ పక్షి   ఆహారం  కోసం  దూరంగా
వెళ్లింది. అదే  సమయంలో  చెట్టు  గూటిలోంచి  ఒక  పక్షి పిల్ల
నీటిలో  పడిపోయింది. అక్కడ  బండరాతి  మీద  ఎండ
కాగుతున్న  తాబేలు  చూసి  వెంటనే  ఈదుకుంటు  నీటిలో
పడిన  పక్షి పిల్లను  తన  వీపు డిప్ప మీద  కూర్చోబెట్టి  గట్టుకు
చేర్చింది.
       ఇంతలో  పిల్లలకు  ఆహారం  తెచ్చిన  తల్లి పక్షి  తాబేలు
చేసిన  సహాయానికి  కృతజ్ఞతలు  చెప్పింది.
    ఇప్పుడు  ఈ పక్షి పిల్లను  చెట్టుపైనున్న  గూటికి  ఎలా
చేర్చడమని  సమస్య  వచ్చింది. భూమ్మీద  ఉంటె  ఇతర
జంతువులు, జలచరాలతో  పిల్ల పక్షి  ప్రాణాలకు  ముప్పు
ఉంది.
    గట్టుకు  మరో వైపున  చెట్లకు  కొన్ని పిచుకలు గూళ్లు  కట్టుకుని
నివశిస్తున్నాయి. వాటిలో కొన్ని పక్షులు  నివాశం లేక  శిధిలాస్థలో .
 ఉన్నాయి.  తాబేలు సలహా మేరకు  ఒక చెట్టుకు  వేలాడుతున్న 
 పిచిక గూడును  ఫ్లెమింగొ తల్లి పక్షి  నోటితో  తెచ్చి పిల్లను అందులో 
  పెట్టి  చెట్టు  పైనున్న  గూటికి  సురక్షితంగా  చేర్చింది.
    ఫ్లెమింగొ పక్షి,  తాబేలు  తమ స్నేహబంధం  బలపరుచుకున్నాయి.
                         సమాప్తం



కామెంట్‌లు