నా నాన్న :- -మంజుల పత్తిపాటి -.మాజీ డైరెక్టర్-ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ .-9347042218
జీవితంలో ఎన్ని ఆటుపోట్లుఎదురైనా
 ఎన్ని తుపానులు వచ్చిన రక్షణ కవచమై
నిలిచి ప్రేమను పంచుతు...
బత్రుకర్ధం చెప్పిన భగవంతుడు నాన్న ..!
గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా
చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజంపై
తట్టి గెలుస్తావులే అని దగ్గరకి
తీసుకుని హత్తుకునే వ్యక్తి నాన్న..!
ఓ ఆప్యా యత, ఓ భరోసా, ఓ త్యాగం నాన్న..!
తొలి గురువు, స్నేహితుడు, మార్గదర్శి నాన్న..!
తానే బొమ్మయి ఆడించే వ్యక్తి  నాన్న..!
సరైన మార్గంలో పయనింప చేస్తూ
గమ్యా న్ని పరిచయం చేసిన వ్యక్తి నాన్న..!
నాన్న నాతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలను మధురమైన స్మృతులుగా మలచుకున్న.... 
మీ ప్రేమ నా కలలకు ఇంధనంలా పనిచేస్తుంది
 నాన్న మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. 
అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలతో..

( జూన్ 15 అంతర్జాతీయ పితృ దినోత్సవం ) 

కామెంట్‌లు