నా పంచపదుల సంఖ్య---
1727-1729.
1727.
కురుక్షేత్రం సంధి విఫలం, అనివార్యం మహాయుద్ధము!
నేడు శాంతి దారి ఎడారి,
రహదారి మరి రణము!
ఎద్దులు దెబ్బలాడుకుంటే ,
లేగదూడల మరణము!
ఏ దేశాల కలహమైనా,
ప్రజలే బలి నిశ్చితము!
గెలిచినా ఓడినా ప్రజల,
కన్నీటి కథే ఖాయము,
పివిఎల్!
1728.
దేశాలు ఏవైనా సరే ,
ఆపలేని పోరే ప్రత్యక్షము!
మానవత్వం మృగ్యం జన, జీవనదృశ్యం దానవత్వము!
ఆకలి, భయము ఆయుధాల, మృత్యువు చాచు హస్తము!
శిధిలాల మధ్య శవాలు ,
ఆరని మంటలు సాక్ష్యము!
ఒకరినొకరు ఆక్రమించడమే, యుద్ధ ఆశయము, పివిఎల్ !
1729.
ఏమున్నది గర్వకారణం? యుద్ధమోమదం, ఉన్మాదము!
భూమి తడుస్తుంది రక్తంతో, కాకుంటే కన్నీళ్లే, నిజము!
ఈనాడు ప్రపంచ యుద్ధాల, పునరావృత తరుణము!
యుద్ధాల గుణపాఠం మనిషి, నేర్వడు నగ్న సత్యము!
మనిషి గెలిచి, మంచితనం,
ఓడడం అదే యుద్ధము,
పివిఎల్!
________
జనదహన దావానలం!: - డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి