ప్రపంచయోగాదినోత్సవం. జూన్ 21.
.శుభాకాంక్షలు అందిస్తూ.
=======================
1.
యోగం ప్రాప్తంలో లేనిది!
ప్రాప్తి అభ్యాసాన చేకూరేది!
సాధన తో సాధ్యం కానిదేది?
యోగాభ్యాసం లేనిది ఇచ్చేది!
2..
లేనిది పొంది అనుభవించాలి!
క్షేమం భోగం ప్రసాదించాలి!
యోగక్షేమం వహామ్యహం!
మనిషినమ్మి ఆదారి నడవాలి!
3.
నేడుయోగా మానవజీవనరీతి!
విశ్వాన విస్తరించే యుద్ధభీతి!
లేకున్నది ఒక్కటే విశ్వశాంతి!
శాంతిసాధన యోగాయే గతి!
4.
యోగా కేవలం ఓ ఉత్సవమా?
విశ్వమానవచైతన్యఉద్యమం!
జీవన సద్గతికి దివ్యోత్సాహం!
వసుధైక కుటుంబ ఆహ్వానం!
5.
యోగ దైనందిన జీవన భాగం!
అంతర్దృష్టితెరిచేసింహద్వారం!
మనసు కుదుటపడే సన్మార్గం!
మనిషి తరించే ధ్యానసూత్రం!
6.
విశ్వాన భారతదేశ వరదానం!
ఋషులిచ్చిన జ్ఞాననిధానం!
బాల్యం యోగామొదటిస్థానం!
జీవితం ఆగని మహాప్రస్థానం!
+++±++++++++++++++++
___'_____
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి