అసలైన జీవన దానం!:- డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం, 9441058797.
( ప్రపంచ అవయవదాన మార్పిడి రోజు). 
==============================

నా పంచపదుల సంఖ్య---
    1745--1746.

1745.
మరణానంతరం, నీ దేహము,, దహనము /ఖననము.!

నీతో పాటు నీ అవయవం.
 మరణించక జీవనము! 

అవయవ దానము జీవితాన, అద్భుత సుకృతము!!

దాతకు గ్రహీత,  కృతజ్ఞతే, 
ఆజీవన పర్యతము!

అవయవ భర్తీధారే,
కీర్తిశేషుడు, స్ఫూర్తిజీవుడు,
 పివిఎల్!

1746.
అవయవదానం సామాజిక, స్పృహ,జనవివేకము!

ఒక్కొక్కరు,ఒక్కొక్కరికి,
 చేయగ జీవనదానము!

నేత్రదానం అంధులకు,
 జీవన వెలుగు ప్రదానము!

ఏ అవయవం దానికదే సాటి, పూడితే ఆలోపము! 

దాతా! నీవే గ్రహీతకు, వరమిచ్చిన ఇష్టదైవము,
 పివిఎల్!
_________

కామెంట్‌లు