నా పంచపదుల సంఖ్య---1730-1732.1730.సాహిత్యాన దివాకరుడు,అవధాన ప్రభాకరుడు!నిత్య సత్య పరిశోధకుడు,మేటి శిష్యుల గురుడు!సహేతుక విమర్శకుడు,గ్రంథరచనా సమర్థుడు!విద్యాసనాధ,కళాప్రపూర్ణ,,కవిభూషణ, మాన్యుడు!దివాకర్ల వేంకట అవధాని,సరస్వతి పుత్రుడు,పివిఎల్!1731.బాల్యానే ధారణాశక్తి,పద్యాలు"భారతి"ముద్రితము!విద్య ,ఇల్లు-విశ్వవిద్యాలయం,డాక్టరేట్. కైవసము!గ్రంధాలు పద్యం,గద్యంవిమర్శ, వ్యాఖ్యానం,బహుముఖము!కవి పండితుల గ్రంథాల,సరి పీఠికా లేఖనము!పెక్కుసాహితీ సంస్థలతోడసుదీర్ఘ అనుబంధము,పివిఎల్!1732..వారి ఉపన్యాసం శ్రోతల, చెవుల అమృత పానము!తెలంగాణ గ్రామీణుల, సాహిత్య చైతన్య సాధనము!ఉపన్యాసాలకు జనం, తరలిరావడం సహజము!వసుచరిత్ర ఉపన్యాస,కళాప్రతిభా కేతనము!వర్షం వచ్చినా, లెక్క చేయక, శ్రోతలుండడం అనన్యం,పివిఎల్!_________
విశిష్ట అవధాని! శ్రేష్ట రచనల గని!:- డా పివిఎల్ సుబ్బారావు,-9441059797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి