(ఎల్లలు లేని ప్రపంచం, తెలియనివి ఎన్నెన్నో ఇక్కడ నేర్చుకుందాం)
సెలవులు పూర్తి..
ఇక చదువులకై ఆర్తి..
నీకు తెచ్చును కీర్తి..
తరగతి గది తలుపులు
తెల్లవారితే తెరుచుకుంటాయి..
పుస్తకాలు పువ్వుల్లా విచ్చుకుంటాయి.
విద్యార్థులు వడిగా, వినమ్రంగా
గురువుల వద్దకు చేరుకుందురు.
కొత్త తరగతుల్లో కూర్చుందురు.
పలకా బలపం
పుస్తకం పెన్నూ పట్టి
పంతులు గారు చెప్పిన
పదాలు, పాఠాలు, పాటలు
తెలుసుకుందురు ..
పఠనం, వల్లె వేయడంతో నేర్చుకుందురు..
బడికి వెళ్ళనంటే మారాం చేస్తే మడికి..
అయ్యతో అరక పట్టాల్సిందే.
పనులకి పోవాల్సిందే..
ఆపై లెక్కలు రాక చిక్కులు..
సమయం తెలియక చూడాలి దిక్కులు..
బడి ఎగ్గొట్టి బయట
బలాదూర్ తిరిగే గడుగ్గాయిలు
భవిష్యత్ లో పడాలి బాధలు
పొత్తం పట్టని,
బల్లలు ఎక్కి ఈలలు,
గోలలు, అల్లరి చేసే పిల్లలు
బెత్తం దెబ్బలు తిందురు.
రాతలు రాయని
కోతలు కోసే వారికి ఇంట్లో వాతలు..
ఆపై పూతలు..
చీవాట్లు తిందురు.
చదువులు చదవని, నేర్వనివారు
చవటలవలె, వెధవలు వలె మొదవలు వలె తిరుగుచుందురు.
ఎల్లారునూ మెచ్చేది
అల్లరి చేయని కల్లలాడని
మల్లెల్లాంటి మనసున్న పిల్లల్ని..
అందుకనే..
చక్కగా చదువులు చదవండి.
ఉన్నత స్థానానికి చేరండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి