భారతదేశపు బంగరు భవితకు బాటలువేయాలి
యువతరం ఉరకలెత్తాలి
వందేమాతరమనాలి
మూడు రంగుల జెండా ఎంతో మురిసి పోవాలి
నాటి అమరుల తలువాలి
కత్తుల కొట్లాట లేని
కదనమునడపాలి
కరుణనుజూపాలి
బుద్ధుడు గాంధీ చూపిన మార్గం
బుద్ధిగ నడవాలి
మన పెడబుద్దులు మారాలి
నీతులు చెప్పి గోతులు తవ్వే
గుంటనక్కలను
నిలువునపాతరెయ్యాలి
వారి నిజరూపం చూపాలి
వంచన మరిగిన నయవంచకులను
గుంజకుగట్టాలే చర్నాకోలతో కొట్టాలే
మంచిని పెంచి మమతనుపంచే మనుషులమవ్వాలి2
ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కులం బేధం పోవాలే
ఆడమగరెండే కులములు అవనిన నుండాలి
అవనిని మనం ఏలుతుండాలి
రంగులు మార్చే రాజకీయము
రంగులు వెలువాలి
మార్పును కోరే పార్టీలన్నీ ముందడుగేయాలి
ఆకలి పేగుల ఆర్తనాదాలు ఆగిపోవాలి
బీడునేలన పచ్చని పంటలు పండించి తీరాలి
నైతిక విలువలు లేని చదువులన్నీ నశించిపోవాలి
మంచిమమతగల్గినచదువులు విశ్వంనేలాలి
అబద్ధమాడే అడ్డగాడిదలను దూరంగుంచాలే
నిజానికి ఉన్న విలువ ఏమిటో నిరూపించాలి
ఆహార కల్తీ చేసే దొంగల దొరకబట్టాలి
ఆ కల్తీ సరుకుల ఆహారం వాడికే పెట్టాలి
స్మార్ట్ ఫోన్లకు బానిసలైన బాలబాలికల మార్చాలి
చదువు గొప్పతనమంతా పిల్లలకు
చెప్పాలి
సోమరితనపు సోదిమాటలకు స్వస్తి పలకాలి
చలాకితనముతో బ్రతకాలి
పని సంస్కృతి నీలో పెంచి పనితనమును చూపాలి
మన బ్రతుకులు మారాలి
చిన్న పెద్ద తేడా మరచి కలిసే నడవాలి
కలహాలు వీడాలి
ఐకమత్యపు రాగము మనం ఆలపించాలి
బురదన పుట్టిన తామరపువ్వుల మనం శుద్ధిగుండాలి
తప్పులులేని ముప్పులు రాని దారిన నడవాలి
సత్యలోకంచేరాలి
నిత్యం సుఖముగ నుండాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి