అతడు హలధారి
నిష్కామ కర్మ యోగి
పంటపోలం పాడియావులు
అరక పశువులు
తన ఆస్తిపాస్తులు
లోకానికి అన్నపెట్టువాడు
తనను అన్నదాత అంటారు
ఆపద సమయంలో ఆదుకునే
నాథుడేలేక అల్లాడుతాడు
విత్తనాలు ఎరువులు పురుగుమందులు అన్నింటినీ
అరువు కు తెచ్చి అవస్థలు
పడుతున్నవాడు
తీరా పంటపండించాక
గిట్టుబాటు ధర లేక
ఉరికొయ్యకు వ్రేలాడే
అనామకుడాతడు
రైతుకు పంటరుణాలు
సబ్సిడీ విత్తనాలు
అతివృష్టి అనావృష్టి వడగండ్లు
ఊరటనిచ్చే పథకం
దేశానికి వెన్నెముకైన రైతును
ఆదుకోవడం ప్రభుత్వం గొప్పమనస్సుకు నిదర్శనం
ఎద్దు ఏడ్చిన ఎవుసం
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు
అందుకే రైతు
సరిహద్దులో రక్షకుడు
జ్ఞానాంజన దిద్దే గురువు
బంధువులు స్నేహితులు
అందరికంటే రైతు గొప్పవాడు
అందుకే కృషివలున్ని కాపాడుకుందాం
వ్యవసాయాన్ని పండగచేసుకుందాం
రైతునాధుకోవడం
కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల
కనీస బాధ్యత అని గురైరగాలి
జై రైతన్న జైజై రైతన్న
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి