అమ్మ పై ప్రేమానురాగాలు
కుంభవృష్టిలా కురిసి
అది వాగువంకలుగా మారి తుదకు యేరై
పొంగిపొర్లుతుంది
అమ్మకు ఈ ఒక్కరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
అమ్మ ఆనందాతిశయంతో
ఉబ్బితబ్బిబైపోతుంది
పబ్లిసిటీ కోసమై కొడుకు
తల్లిని వృద్ధాశ్రమం నుండి
ఇంటికి తీసుకొచ్చాడు
తల్లికి కడుపునిండా భోజనం పెట్టి
సాష్టాంగ పడి నమస్కారం చేసి
ఇక పద
నేను ఎంత బిజీనో నీకు తెలుసుగా
వృద్ధాశ్రమం నుండి ఫోన్ వచ్చింది
నిన్ను తీసుకొని రమ్మని
ఇప్పుడు బెంగుళూరుకు నాకు
తిరుగు ప్రయాణముంది
పద పద
అప్పుడప్పుడు నువ్వే ఫోన్ చేస్తుండు
నాకు వీలుంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాను
లేకుంటే లేదు
నిన్ను చూడాలి చిన్నా
నువ్వు రారా
నీ పిల్లలను చూడాలని గొంతెమ్మ కోరికలు కోరకు
నేనంటే
నీ కొడుకును
ఈ మాత్రం ప్రేముంది
నా కొడుకుకు రేపు ఈ మాత్రం
ఉంటదో... ఉండదో ....
పదపద....
ఇదేగా నీ బట్టల మూట
తీసుకొస్తున్న..
పద... తల్లి ...
నీకు వేలవేల వందనాలు
నేను టైంకు ఇంటికి చేరకోలేదనుకో
ఇక నేను ఇంటికెళ్ళడం ఉండదు
ఆటో ..2
ఇదిగో ఆటో అబ్బాయి
ఈ అమ్మను వృద్ధాశ్రమంలో దిగబెట్టు
నీ ఫోన్ నెంబర్ చెప్పు
నువ్వు దిగబెట్టాక
నాకు మిస్డ్ కాల్ ఇవ్వు
దిగబెట్టావా లేదా తెలుసుకోవడానికి
ఇదిగో బాడుగ డబ్బులు
వెళ్ళు వెళ్ళు
అంటూ పరిగెత్తాడు
కొడుకు ....
ఏమి చేయలేని నిస్సహాయతతో
ఆ తల్లి బేలగా
కొడుకు వెళ్లే దారెంటా చూస్తూ
జాగ్రత్త నాన్నా
జాగ్రత్త అని అంటుంది
ఎంతటి దయార్ద్ర హృదయం అమ్మది
(ఇది నేను పేపర్ లో చదివిన ఒకానొక సంఘటన ఆధారంగా వ్రాసిన కవిత)
కుంభవృష్టిలా కురిసి
అది వాగువంకలుగా మారి తుదకు యేరై
పొంగిపొర్లుతుంది
అమ్మకు ఈ ఒక్కరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
అమ్మ ఆనందాతిశయంతో
ఉబ్బితబ్బిబైపోతుంది
పబ్లిసిటీ కోసమై కొడుకు
తల్లిని వృద్ధాశ్రమం నుండి
ఇంటికి తీసుకొచ్చాడు
తల్లికి కడుపునిండా భోజనం పెట్టి
సాష్టాంగ పడి నమస్కారం చేసి
ఇక పద
నేను ఎంత బిజీనో నీకు తెలుసుగా
వృద్ధాశ్రమం నుండి ఫోన్ వచ్చింది
నిన్ను తీసుకొని రమ్మని
ఇప్పుడు బెంగుళూరుకు నాకు
తిరుగు ప్రయాణముంది
పద పద
అప్పుడప్పుడు నువ్వే ఫోన్ చేస్తుండు
నాకు వీలుంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాను
లేకుంటే లేదు
నిన్ను చూడాలి చిన్నా
నువ్వు రారా
నీ పిల్లలను చూడాలని గొంతెమ్మ కోరికలు కోరకు
నేనంటే
నీ కొడుకును
ఈ మాత్రం ప్రేముంది
నా కొడుకుకు రేపు ఈ మాత్రం
ఉంటదో... ఉండదో ....
పదపద....
ఇదేగా నీ బట్టల మూట
తీసుకొస్తున్న..
పద... తల్లి ...
నీకు వేలవేల వందనాలు
నేను టైంకు ఇంటికి చేరకోలేదనుకో
ఇక నేను ఇంటికెళ్ళడం ఉండదు
ఆటో ..2
ఇదిగో ఆటో అబ్బాయి
ఈ అమ్మను వృద్ధాశ్రమంలో దిగబెట్టు
నీ ఫోన్ నెంబర్ చెప్పు
నువ్వు దిగబెట్టాక
నాకు మిస్డ్ కాల్ ఇవ్వు
దిగబెట్టావా లేదా తెలుసుకోవడానికి
ఇదిగో బాడుగ డబ్బులు
వెళ్ళు వెళ్ళు
అంటూ పరిగెత్తాడు
కొడుకు ....
ఏమి చేయలేని నిస్సహాయతతో
ఆ తల్లి బేలగా
కొడుకు వెళ్లే దారెంటా చూస్తూ
జాగ్రత్త నాన్నా
జాగ్రత్త అని అంటుంది
ఎంతటి దయార్ద్ర హృదయం అమ్మది
(ఇది నేను పేపర్ లో చదివిన ఒకానొక సంఘటన ఆధారంగా వ్రాసిన కవిత)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి