సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
================
ఓ పరమేశ్వరా! పాహిమాం!
త్రిశూలధారివై ఢమరుకం మ్రోగిస్తూ,
కైలాసగిరి పై తాండవం చేశావు.
బోళాశంకరా, నీకెంత జాలయా!
దేవతలందరూ శరణని వేడగా,
క్షీరసాగర మథన సమయాన వచ్చిన,
హాలాహలము మింగ బూనినావు!
నీకు తగ్గ జోడు హిమవంతు నందన,
లోక క్షేమం తలచి, నమ్మి తాళి,
అభయనిచ్చి పంపె విషము మింగ.
భీతి కొలువు విషము తక్షణమే మింగి,
కంఠము నందునే నిలిపినావు.
ఆ ప్రభావంబుచే కంఠం మాడగా,
నీలకంఠుడిగ ప్రసిధ్ధినందినావు.
భస్మాసురుడు కోర్, వరమిచ్చి నీవేమో,
పరుగు లంకించావు ప్రాణభయంతో.
మోహిని రక్షింప, ఆమెనే మోహించి,
హరి హర నందను నొందినావు.
భగీరథుడు కోర, గంగను బంధించి,
జటా జూటంబులో దాచినావు.
నీ మహిమ వర్ణింప, నాతరము
గాదయా....ఓ నీలకంఠా!!
పరమేశ్వరా, పాహిమాం: -కోలా సత్యనారాయణ -విశాఖపట్నం -9676623939
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి