సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
====================
సృష్టి స్ధితి లయకారుడు శివుడు !
భక్తులు పాలిటి బోళాశంకరుడు !
జగతిని కాపాడు జగన్నాథుడు !
నిత్య ఆరాధ్యుడు శుభశంకరుడు !!
శివనామస్మరణం..సకల పాపహరణం !
శివార్చన,శివాభిషేకం..దుఃఖ నివారణం !
శివపురాణ పారాయణం..భవసాగర తరణం !!
శివుని దివ్యతేజ రూపం..ఆదియోగి రూపం !
శివుని విశ్వరూపం...అష్టమూర్తుల స్వరూపం !
శివనామం రమణీయం-శివరూపం కమనీయం !
నిరాడంబరంగా బతకడమే శివతత్వం.....
జింకచర్మం,మెడలో సర్పం, ఒంటికి విభూధి,
నిరాడంబరుడైన దేవదేవుడు పరమశివుడు !
బడుగుజీవులను ప్రేమించడమే శివతత్వం.....
మారేడుదళాలు అర్పిస్తే..వసమైపోతాడు !
నీలతో అభిషేకిస్తే పరవసుడైపోతాడు శివుడు !!
నమ్మినవారిని ఆదుకోవడమే శివతత్వం.....
గరళాన్ని మింగి దేవతలను కాపాడిన శివుడు !
అర్ధనారీశ్వర తత్వమే శివతత్వం..... అర్థభాగాన్ని భార్యకిచ్చిన పార్వతీపతి శివుడు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి