జనం గుండెల ఉన్నారు: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
పురాతనమైనా సనాతనమైనా కాలంలో 
జీవన చక్రం నడక 
ఔటాఫ్ ది బాక్స్ కాదు
 
రాకడ పోకడలో
జరామరణాలు కొత్త కాదు
వెనకా ముందు
ఇన్ బాక్స్ లో కొచ్చిన ప్రతిదీ 
ఔట్ బాక్స్ లోకి రావడమే జీవితం 

అక్కడ చెట్టున్నది 
ఆకుల చేతులతో నీడను పరుచుకొని 
కొమ్మలుగా బతికిన కావ్యం 

వృద్ధోపనిషత్ ల అలిసిన భావోద్వేగాలు   
తీగ తెగిన రాగవీణ స్వరాలు

కాలం సంకెల బిగిసింది 
గాలి తోడువీడ ప్రాణం గాలిలో
గదిలో అంతా ఖాళీ చీకటి
కిటికీ తెరిచిన లోపల శూన్యం

నిజమే,కళ్ళముందు లేరు కానీ
నీడను విస్తరించిన చెట్టు 
ఊడలై
నిన్నటిదాకా నడిచిన అడుగుల కనులు
మరిక చెట్టు వెలుగు వేళ్ళై
జనం గుండెల ఉన్నారు

==========================


(తొలితరం తెలంగాణ ప్రముఖ సర్జన్ కరీంనగర్ వైద్యశిఖామణి డా.వి.భూంరెడ్డి  92 ఏండ్ల వయసులో కన్నుమూశారు.)
కామెంట్‌లు