గేహదేహాల గాంధర్వం
కావ్యగీతికల రసమయ కాంతుల
నవ్యపోకడలల్లిన కవితారూపం
భూమ్యాకాశాల సాక్షిగా
తెలుగు కవితాశ్వమెక్కిన కాంచన సుందర మంజుల మనోజ్ఞ సీమ
బంధప్రబందాల రమణీయ రమణి నర్తనమై ఊగే తనూలత
అక్షరం నిలువెల్లా ఆవహనం
కదిలే ఊహలకే కన్నులాయే
పగలే వెన్నెల జగమే ఊయల
కలం సినారే కన్నారే
పొలం దున్నిన హలమే
వెలిగించే గేయకావ్యాలు
కర్పూర వసంతరాయలు నాగార్జున సాగరం
చూసే చెవులలో కనులలో
నవ్వని పూవై నడిచీ నడిచిన
కవితాంతరంగమే విశ్వంభర తపస్వి
విశ్వ రూపమై ఎగిరిన రెక్కల కవితావిపంచి
ప్రపంచపదుల పసుల పోశమ్మనే కదా నడిపించే
తెలుగు కవిత్వాన కసపిసదొక్కిన శాలివాహను పాదాల అలరిన సంప్రదాయాలు ప్రయోగాలు పరిశోధన గీటురాయి
గవాక్షాలు తెరిచిన అక్షరగని
నిజమే పగలే వెన్నెల చూపే
కవిత్వమే బతుకైన వచన కదంబం
అక్షరమైన ప్రభవ
కవిత్వమై సాగె నదీ ప్రవాహం
సాలోక్క సంపుటి లెక్క
జీవితం రాసే కమ్మకమ్మలో
కొమ్మకొమ్మకు పూసిన పూలవాసన
నిజమే కనిపించేది
పగలే వెన్నెల జగమే ఊయల
కదిలే ఊహలకే కన్నులాయే
మాటల రసఝరి కవిత్వ స్వరధుని
సినారె చిరునవ్వుల ముఖం
హన్మాజీపేట అక్షర ఝరం
జ్ఞానపీఠమెక్కిన అపర సాహితీ పుత్రుడు
---------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి