ఎప్పడైనా :- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
అనుకున్నామా 
ఎప్పుడైనా కలగంటామని
నీవూ నేనూ
అలా మైదానంలో ఆటలా కలుస్తామని 

ఆమె రాసిన కవితలా 
అందంగా 
నేను
చెట్టులా నిటారుగా వీస్తూ 
నీ కళ్ళలో  
స్నేహచిరునవ్వు బతుకు నేస్తాననీ 
ఎప్పుడైనా నిజం తెలిసేనా 

ఆకాశంలో  ఇక
నీలిమేఘాల వెన్నెల తేలి
కవిత అక్షరమాల మెరుపు ధ్వనులే కురుస్తుంది 
మనసు గీసిన కలల వాకిట

అనుకోలేదే ఎప్పుడూ 
గీత సంగీతం 
ఆ కలం నిర్జల నడక నాట్యమని

శిఖరశిరమై ఎగిరే కన్నుల
అహం సిరి చిరునామా 
ఎవరినైనా దూరం చేసే కళ
నవ్వుదాచిన తాత్పర్యమని 
ఎప్పడైనా కలగన్నామా!
లేదే!




కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Dream and Reality, feeling and logic and Belief and Trust never meet but go together in the modern world. Lyrical expression of the same feeling is excellent.