వృత్తలేఖిని :- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
కాలం కేంద్రంగా గీసే
వృత్త పరిధిలో
జీవ క్షేత్రం బతుకు
మనిషి మనుగడ గడబిడ అంతా అక్కడే

పుట్టుక సంగీతంలో
తొలికేక శిశువు
ఆట పాటల 
ఆఖరి చరణం మృత్యువు
రెంటి నడుమ మనిషి బతుకు 

రావడం పోవడం
జనార్ణవంలో సంఖ్యగా అటూఇటూ
నడుమ నీటిబుడగ నటన
జీవితం చివరిమెట్టులో 
చిరుగాలికే కూలే సుందర రమణీయం

ఉన్ననాళ్ళలో చేసిన మేలు 
అదే పనిగా 
యాదిల పడేసే పాద ముద్రలు
నీ పనినీ ఆ ముద్రలనూ అన్వయింగల మనిషికే గుర్తులు

అనిర్వచనీయ దృశ్య శబ్దాలు 
జీవ లయ దరువు క్రియలు
జననమరణాల సంధి కాలం సంచలనం

వృత్తలేఖిని 
చేతికందే దూరంలో గీసే వృత్తంలో 
ఊగే గంటల సంచారమే ప్రాణం
శబ్దమౌనం నిశ్శబ్దరాగం కలిసే వేదిక


కామెంట్‌లు