అక్షర భావాలు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
చిట్టి చీమను చూసి
క్రమశిక్షణ నేర్చుకో
పొదుపు విలువను తెలిసి
భద్రంగా వాడుకో

భూమాతను పరికించి
ఓర్పును అలవర్చుకో
నలుగురికి మంచి పంచి
గుండెల్లో నిలిచిపో

పచ్చని చెట్టును గాంచి
ఎదుగుదల కోరుకో
భువిలో వాటిని పెంచి
పుణ్యం కాస్త కట్టుకో

పుస్తకాలు పట్టుకుని
విజ్ఞానం పొందుకో
ప్రతిదినమూ చదువుకుని
ఉన్నత స్థితి చేరుకో


కామెంట్‌లు