గాలి వాహనంలో ..ఆశల గల్లంతు:- ఇమ్మడి రాంబాబు తోరూరు-9866660531
 గాలి వాహనంలో ..ఆశల గల్లంతు
విదేశీయానం కన్నా.. స్వదేశీయే మిన్న
ఉన్నంతలో జీవనమే సంతృప్తి
ఉన్నత విద్యకై.. అత్యున్నత జీవనానికి.. ఆశ పడుతున్న స్వదేశీ యువత మేలుకోవాలి
మన జ్ఞాన సంపత్తిని మాతృభూమి సేవకై అంకితమవ్వాలి నేటి యువత
కుటుంబమంతా ఇక్కడ
ఒంటరి జీవనం విదేశాల్లో ..
దూరమవుతాయి సంబంధ బాంధవ్యాలు.. అనుకోని ఘటనలో అసువులు బాస్తే
కన్నవారి కలలు హరీమంటున్నాయి.
ఆంగ్లేయుల సామ్రాజ్యంలో అడుగుపెడదామని
ఉత్సాహంతో ఉరకలేసిన విమానయానం.. 
గగనానికి ఎగరకముందే. అగ్నికీలలకు ఆహుతాయే... 
వైద్య సేవకులు ప్రయాణికులు.. వారి రుణాను బంధం తీరేది ఎప్పుడు
కుటుంబ రోదన ఆగేదెప్పుడు.
రైలు విమాన ప్రమాదాల్లో
శతాధిక మృతుల  కుటుంబాలకు పరిహారంతో పరిహాసం ఎలా?
కారకులపై కాఠిన్యత చర్యలతో కనికరము చూపండి పాలకులారా?
 రేపటికి రూపంలేని ఈ జీవితానికి.. 
సుఖ సంతోషాలైనా విరహవేదనలైనా ఇప్పుడే అనుభవిద్దాం.
 విమాన ప్రమాద  ఘటన విగతజీవులకు.. మనోవేదనతో అర్పిస్తున్న అక్షర పుష్పతర్పణం..
గుండె కోత కుటుంబాలకు సానుభూతితో అందిస్తున్న కవితాక్షర సంఘీభావం

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
కవిత ప్రచురించినందుకు ధన్యవాదములు సార్