వృక్ష రాజమా - నీకు వందనం:- కనుమరెడ్డి రామిరెడ్డి- కోడూరు-9908286792
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కవితలు
=============
వృక్ష రాజమా! 
నీకు వందనం....!

వృక్ష జాతికి అంకితం
మానవ జీవితం..!

సమస్త వృక్షముల కిరణజన్య సంయోగక్రియా జనిత ప్రాణవాయువు...!

సకల జీవరాసులకు జీవనాధారం..!

మానవులచే వదలబడిన వాయువు వేల వృక్షములకు ఆయువుపట్టు...!
 
సృష్టి యావత్తూ ఆధార భరితం మనిషి మినహాయింపు కాదు..!

కృత్రిమ మేధస్సుతో ప్రకృితిని
విధ్వంసం చేస్తూ, 
గర్వంతో విర్రవీగుతూ, 
తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటూ,
చెట్లని తన స్వార్ధావసరాలకు 
విచ్చలవడిగ  వినియోగించు కుంటూ, భవిష్యతరాల తలరాత తనే లిఖిస్తూ.... !

సర్వ మానవ మారణ హోమానికి మరణ మృదంగం వాయిస్తుంటే...!

సాటి మనిషిగ నవ్వాలో,
మూర్ఖుడని జాలిపడాలో
తెలియని తనంలో..,!

 విధి/దైవంఏమాత్రం 
లేదనేది సుస్పష్టం...
కొంచెం ఆలస్యం కావచ్చు కాని...చర్యకు ప్రతీకార చర్య - ప్రకృతి ప్రకోపించినపుడు తప్పక తీసుకుంటుంది..!

 తస్మాత్జాగ్రత్త...!

              రెడ్డి రామ్,కోడూరు 9908286792......
                   శలవు.


కామెంట్‌లు