ఎంత ఎదిగి పోయావమ్మా:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-విశాఖపట్నం-9963265762.
నలుబది సంవత్సరాలు
నాతో జీవితాన్ని పంచుకుని
నా చిట్టితల్లికి  జన్మనిచ్చి
నా జీవితాంతం తోడునీడగా
నా వెంటే ఉంటానని

నన్ను, నా చిట్టితల్లిని కంటికిరెప్పలా చూసి
నాతో మీకేమి మాటతీరు తెలియదు
నేను లేకపోతే ఎలా బతుకుతారో అని

నిజంగా  దేముని దరి చేరిన ధర్మపత్నిని

తలుచుకుని భాధ పడుతుంటే
నాన్న మీకెందుకు భయం
నీకు తల్లినై ఆప్యాయతతో
నేను చూసుకుంటాను

నాకు మీ సేవచేసే భాగ్యము కల్పించు అంటే
నా బాల్యంలో అమ్మలా నే
కనిపించింది నే కన్న నా పాప.
నేను అపుడు ఎంత ఎదిగి పోయావమ్మా అని 
ఆమె చేతిని ఆప్యాయంగా తీసుకున్నా.....!!
.................................

కామెంట్‌లు