అమ్మయే నా జీవితానికి స్ఫూర్తి:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- విశాఖపట్నం.-9963265762.
ఆరు సంవత్సరాల వైవాహిక జీవితంలో
అందరి దేముళ్ళని వేడుకున్న ఫలితంగా
అమ్మ కడుపున అంగవైకల్యంతో పుట్టిన
నన్ను
అందరు చివరికి జన్మకుకారణమైన తండ్రి కూడా 
అవిటిదని దరిచేరనీయకపోయిన
అనురాగ, ఆప్యాయతలతో అమ్మ
నేనున్నాని ఎవరేమన్నా భాధ పడకని
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళిన మహనీయుల గాధలను చెప్పి ప్రోత్సహించినపుడు
అలుపెరుగక,అవిశ్రాంత సాధనతో పట్టుదలే ధ్యేయంగా
నాట్యమయూరినై
దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వేళ చీదరించుకున్నవాళ్ళే
పొగిడినపుడు  
రాష్ట్రపతిగారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సమయాన
పరదేవతా స్వరూపమైన అమ్మ ఆధారంతో అల్లుకుని అందనెత్తుకు ఎదిగానని
ఆమ్మ అనే అనుబంధమే
నా జీవితసాఫల్యతకు కారణమని మాతృమూర్తి
చరణాలపై ప్రణమిల్లాను.!!
...............................
 

కామెంట్‌లు