గగనాన కొలువైన
ఓ నీలి మేఘమా!
నీ పొట్ట నిండా మాత్రం నీటిని నింపుకుంటావు.
కానీ మమ్మల్ని మాత్రం
ఖాళీ కడుపులుగా మిగులుచుతావు..
ఏంటో మాపై అలకనా
నిను గానక మేము ఉండగలమా?
నీ చినుకు సవ్వడి వినరాక
మా మది మూగబోయే.
ఏరువాక పౌర్ణమి వచ్చే
ఏది నీ జాడ కానరాదాయే
వలయాకారంగా మా చుట్టూ
అలుముకున్న అంధకారం.
ప్రతి మా నడకలో..
నిర0తర జీవన గమనంలో.
అన్ని శంకలే అంతులేని ఆత్రాలే
మా కనుపాపలు నెర్రలు భారీ
రక్త మోడుతున్న మాకన్నీటి
రుధిర బిందువులు
ఎర్ర సంద్రమై పారగా.
కలతతో హృదిని ఆవేదన
అనే గుణపాలు గుచ్చగా.
అసాహయపు నిట్టూర్పులతో
నిలువెల్లా వణికి పోతున్నాం
మా హృదిలోన కదలాడే
చింతాక్రాంతులన్నీ తొలగించ లేవా
మా జీవన సహచరివి నీవే కదా
జీవిత గమనానివి నీవే కదా!
మా ప్రథమ నిరీక్షణే
మోమున ప్రమోదహేతువై. .
అలసిన వేళ అహల్లాదవీచికలై
మా వదనాలు దరహాస చంద్రికల్లా.
హృదిని వికసింప చేయలేవా
విషాద రేఖలై అలుముకున్న
మా రైతాంగ జీవితాన్ని...
చల్లని నీ చినుకుల సవ్వడులతో
పులకరింపజేయలేవా
మము కనికరించరావా
ఓ నీలి మేఘమా! ప్రణమిల్లి
ప్రార్థిస్తాము అంగీకరిస్తావా.
ఓ నీలి మేఘమా!
నీ పొట్ట నిండా మాత్రం నీటిని నింపుకుంటావు.
కానీ మమ్మల్ని మాత్రం
ఖాళీ కడుపులుగా మిగులుచుతావు..
ఏంటో మాపై అలకనా
నిను గానక మేము ఉండగలమా?
నీ చినుకు సవ్వడి వినరాక
మా మది మూగబోయే.
ఏరువాక పౌర్ణమి వచ్చే
ఏది నీ జాడ కానరాదాయే
వలయాకారంగా మా చుట్టూ
అలుముకున్న అంధకారం.
ప్రతి మా నడకలో..
నిర0తర జీవన గమనంలో.
అన్ని శంకలే అంతులేని ఆత్రాలే
మా కనుపాపలు నెర్రలు భారీ
రక్త మోడుతున్న మాకన్నీటి
రుధిర బిందువులు
ఎర్ర సంద్రమై పారగా.
కలతతో హృదిని ఆవేదన
అనే గుణపాలు గుచ్చగా.
అసాహయపు నిట్టూర్పులతో
నిలువెల్లా వణికి పోతున్నాం
మా హృదిలోన కదలాడే
చింతాక్రాంతులన్నీ తొలగించ లేవా
మా జీవన సహచరివి నీవే కదా
జీవిత గమనానివి నీవే కదా!
మా ప్రథమ నిరీక్షణే
మోమున ప్రమోదహేతువై. .
అలసిన వేళ అహల్లాదవీచికలై
మా వదనాలు దరహాస చంద్రికల్లా.
హృదిని వికసింప చేయలేవా
విషాద రేఖలై అలుముకున్న
మా రైతాంగ జీవితాన్ని...
చల్లని నీ చినుకుల సవ్వడులతో
పులకరింపజేయలేవా
మము కనికరించరావా
ఓ నీలి మేఘమా! ప్రణమిల్లి
ప్రార్థిస్తాము అంగీకరిస్తావా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి