పంతులమ్మ సలహాలు:- -గద్వాల సోమన్న, 9966414580
విజయాలు వరిస్తే
వినయం అలవర్చుకో
ఓటమి పాలైతే
గుణపాఠం నేర్చుకో

పొరపాట్లు జరిగితే
పొరపొచ్చాలు వస్తే
వెంటనే దిద్దుకో
విడమర్చి చెప్పుకో

నిందలు మోపితే
నిరూపణ చేసుకో
శునకాలు మొరిగితే
కొండలా ఉండిపో

ఆశ్రయాన్ని కోరితే
అక్కున చేర్చుకో
ఆపదలో ఉంటే
ప్రేమతో ఆదుకో


కామెంట్‌లు