కానిమ్ము జయప్రదం:- --గద్వాల సోమన్న, 9966414580
జీవితమే చదరంగము
ఆడితే గెలవాలోయ్
పరికించ రణరంగము
యుద్ధమే చేయాలోయ్

ఆటుపోట్లు సహజమే
చెదరరాదు ధైర్యమే
ఆత్మవిశ్వాసంతో
ముందడుగు వేయడమే

అనుక్షణం పోరాటము
బ్రతుకంతా ఆరాటము
ఇదే కదా జీవితము
చేసుకొమ్ము అద్భుతము

విలువైన జీవితాన్ని
అమూల్యమైన స్నేహాన్ని
 కానిమ్ము సార్ధకము
అమోఘమైన జ్ఞాపకము


కామెంట్‌లు