సాహితీ కవి కళాపీఠం
సాహితీ కవితలు
=================
నోరు మంచిదైతే
ఊరు మంచిదగును..!
మాట సౌమ్యమైతే
మనసు మార్ధవమగును..!
మాట తోన సమాజ
మనుగడ కలదు..!
మాట తోన మనిషి
నవడిక ఆధారపడిఉండు..!
జీవిత తరగతి గదిలో
ఉపాధ్యాయుల నీతిమాటలే
మేలిమి మార్గం..!
అమ్మ నోటి దీవెనలే
పూర్ణాయుష్షు ఫలితం..!
నాన్న గుండె చాటు
ప్రేమ పలుకులే
బిడ్డ పురోగతికి నిచ్చెనలు..!
పెద్దల ఆశీర్వచనాలే
ఆత్మవిశ్వాసాన్ని పెంచే
ఆయుధాలు..!
మాటతోనే మలుపు ఉన్నది
మాట తోనే గెలుపు ఉన్నది
మాట తోనే జీవితం ఉన్నది
మాట పొదుపుతో సాగిపోదాం
నవచైతన్య దీపికలమై..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి