రాహుల్ సాంకృత్యాయన్9:- అచ్యుతుని రాజ్యశ్రీ

 రాహుల్జీ అంతా కాలినడక ,సాధువుగా రైలు ప్రయాణంతోతను వెళ్లాల్సిన ప్రాంతాలు చేరేవాడు.అయోధ్య లో ఆయన ఇచ్చిన ఉపన్యాసం అందర్నీ అలరించింది.వేదాంత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే  యూరప్ లో యుద్ధం మొదలైంది .పత్రికల పరిచయం ఆయనకు కల్గడం ఓఅనుభవం.అయోధ్య కు కొంత దూరంలో దేవకాళి ప్రాంతంలో జంతుబలి ఇచ్చేవారు.తమరోగాలు ప్రాణాపాయం తప్పాయని మహిళల నమ్మకం.రాహుల్జీ జంతుబలిని ఆపించే ప్రయత్నం చేసి తన్నులు తిన్నారు.21ఏళ్ల రాహుల్జీ తండ్రి దగ్గరకు వెళ్లాడు.ఆయన యాత్ర లో ఉన్నప్పుడే తాత చనిపోయారు.మనవడి కోసం కలవరిస్తూ ప్రాణంవదిలారు ఆయన. రాహుల్ తండ్రికి బాల్యంలోనే సంసారం నెత్తిన పడటంతోపాటు తల్లి కటువుగా మాటలు చేతలతో ప్రవర్తించుటవల్ల ఆయన పని కుడితిలో పడ్డ ఎలుకైంది.అందుకే భార్య కొడుకు రాహుల్ ని అత్తగారింట్లో ఉంచాడు.కానీ రాహుల్జీ తనయాత్రల కి ఫుల్ స్టాప్ పెట్టక ప్రయాగ చేరాడు.తొలిసారి పండితమదనమోహన్ మాలవ్యాగారి ఉపన్యాసం విని జన్మ ధన్యంగా భావించాడు. ( సశేషం)
కామెంట్‌లు