జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతకుంటలో 21-06-2025 రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలలో నేతాజీ స్కౌటు ట్రూప్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులందరితో యోగా చేయించడం జరిగింది.యోగా డే సందర్భంగా సూర్య నమస్కారాలు,తాడాసనం,వృక్షాసనం,వీరభద్రాసనం,అర్థ చక్రాసనం,త్రికోణాసనం,పద్మాసనం,వజ్రాసనం,ప్రాణాయామం,ధ్యానం లాంటి యోగాసనాలను పాఠశాల విద్యార్ధులందరూ వేయడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి టి శోభారాణి గారు మాట్లాడుతూ "యోగా వలన విద్యార్థులలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం జరుగుతుందని;ఏకాగ్రత పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుందని; తద్వారా విద్యార్ధుల్లో జ్ఞాపకశక్తి,ఏకాగ్రత పెరిగి పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి విద్యలో చక్కగా రాణిస్తారని; విద్యార్థులంతా ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం ధ్యానం మరియు యోగాసనాలు వేయాలని" సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆండాలు,కవిత,రజిత, సదయ్య,వినోద్,లక్ష్మీ రాజ్యం,శ్రీనివాస్,ఇషాక్, కుమార్,అనిల్,శ్రీహర్ష,రవీందర్,సంతోష్,మహేందర్ రావు,చంద్రశేఖర్,స్వర్ణలత,ప్రతిభా రాణి,అశోక్ పాల్గొన్నారు.
చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి