జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో అంతర్జాతీయ యోగ దినోత్సవం వేడుకలు


 నందవరం మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాగలదిన్నెలో  అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ. జాన్సన్ గారి ఆధ్వర్యంలో,బాలసాహిత్తవేత్త,బాలబంధు గద్వాల సోమన్న కలం హలం కదిలించగా "శ్రేష్టమైనది యోగ" గీతం సత్యనారాయణ గళంలో అమృతం పోసుకుంది.విద్యార్థులంతా తెల్లని దుస్తుల్లో కదిలే మేఘాలై కనువిందు చేశారు.యోగలో భాగంగా వ్యాయామం ఉపాధ్యాయుని పర్యవేక్షణ లో అద్భుత యోగాసనాలు చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిత్య జీవితంలో యోగ యొక్క ప్రాధాన్యత వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యాకమిటి చైర్మన్,విద్యార్థులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
కామెంట్‌లు