* దాన గుణం దొడ్డది *:-కోరాడ నరసింహా రావు !
ఏ దానం గొప్పది...?!
  అవసరమైనవారికి...
   అవసరమైనదాన్ని 
   దానం చెయ్యటమే గొప్ప!

అన్నదానం గొప్ప ...
   విద్యాదానం  గొప్ప...అనుకుంటే....
  నేత్ర దానం...ఎందరో అంధుల జీవితాలలో వెలుగులు నింపింది !

 ఈ రోజుల్లో కిడ్నీలు పాడై పోయి బాధపడుతున్నవారు మరణిస్తున్న నారు ....
   కిడ్నీ దాతల పుణ్యమా అని బ్రతికి బట్టకట్ట గలుగుతున్నారుగా !

అన్నిటికంటే...ప్రాణదానమే గొప్పది కదూ...!

నిజమే...మనిషికి ప్రాణం కంటే ముఖ్యమైన దేముంటుంది !? 
  ప్రాణ ముంటేనేకదా... దేనికైనా...!
  రెడ్ క్రాస్ సంస్థ రక్తాన్ని సేకరించి ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన సంగతి లోకవిది తమే...!
    లయన్స్ క్లబ్ ,చిరంజీవి వంటి సేవాసంస్థలు రక్తదాన ఉద్యమానికి మంచి ఊపునే ఇచ్చి...పరోక్షంగా ఎన్నో ప్రాణాలను నిలబెట్టం లేదా !

వీటన్నిటినీ మించి....చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని లిఖించిన ఘనత గూడూరు సీతా మహాలక్ష్మి అని పిలువబడే ఒక మహిళకు మాత్రమే దక్కింది !

ఆమెను , కిడ్నీ వ్యాధితో మరణించిన ఒక బాలుని సంఘటన కలచివేసింది !


బ్రతికున్నవారు వారి కిడ్నీని ఇవ్వటానికి భయపడటం సహజమే..!
    ప్రమాదవశాత్తు మరణించిన వారి శరీరాలను కాల్చేయటమో పూడ్చేయటమో చేసే బదులు వారి అవయవాలను దానం చేస్తే సుమారు ఆరు ప్రాణాలను నిలబెట్టి ఆ బ్రతుకుల్లో వెలుగులు నింప వచ్చు కదా....!

ఈ ఆలోచన ఆమె మదిలో మెదలటం...
   తొలుత ఇది జరిగే పనికాదు అన్నవారే ...
  ఆమె ధృడ సంకల్పంతో ప్రారంభించినపిదప ప్రోత్సహించారు...!

ఆమె ఆశయానికి ఎందరెందరో... డాక్టర్ లు ,ఉన్నత పదవులలో ఉన్నవారే కాక ముఖ్యం గా ఆడా,మగా తేడాలేకుండా యువత ఆమె వెంట నడుస్తూ....ఈ ఉద్యమాన్ని ముందుకు,మునుముందుకు నడిపించటం ముదావహం ..!
 నేడు స్వచ్ఛందం గా అవయవ ,శరీర దానం  
లెక్కకు మిక్కిలిగా మనరాష్ట్రానికే కాక ఇతరరాష్ట్రాలకూ విస్తరించటం...గర్వకారణం...!
    సీతామహాలక్ష్మి ఒక ఉద్యమ కారుని కుమార్తె,
 ఉపాధ్యాయిని... సావిత్రిబాయి పూలే స్పూర్తితో అవసరమైన వారికి విద్య నందించటం మొదలుపెట్టి దాన్ని అలానే కొనసాగిస్తున్న ఆదర్శ మహిళ !
   ఆమె ఆశయాలనన్నిటినీ...విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న యువతే ఆమె ఘనత !!
  ప్రభుత్వ పరంగా ఈ అవయవదాన ఉద్యమానికి ఒక గుర్తింపును గౌరవాన్ని తీసుకురావటం లో సఫలీ కృతురాలైనారావిడ...!
    ఎందరో ఆదర్శ జీవులు ఆమె ప్రేరణతోనే మరణానంతర జీవనాన్ని పొందారు...వారు పోతూ పోతూ...ఒక్కొక్కరూ కనీసం ఆరుగురికి ప్రాణదానం చేశారు !!

మన అంధ విశ్వాసాలను 
మూడా చారాలనూ విడిచిపెట్టి అందరం అవయవ,శరీర దానాలకు ముందుకొస్తే....
  ఎన్నో ప్రాణాలను నిలబెట్టగలిగిన వారమౌతాం...!
   మన అవయవాలు వేరొకరిలో పునరుజ్జీవనాన్ని పొందుతాయి...,మన శరీరం వైద్యవిద్యార్థులకు  పాఠ్య పుస్తకాలవుతాయి !
  మిత్రులారా....రండి అవయవ,శరీర దానాలకు ముందుకు రండి...!
   మరణానంతర జీవనాన్ని పొందండి...!!
      ******

కామెంట్‌లు