సోము అల్లరి పిల్లవాడు. బడి నుంచి ఇంటికి చేరాక పుస్తకాల సంచి ఇంట్లో పడేసి రాత్రి దాకా బయట క్రికెట్ ఆట ఆడి వచ్చేవాడు. సెలవు రోజుల్లో పూర్తిగా ఇంటి పట్టున ఉండడు. తలిదండ్రుల మాటకు బాగా ఎదురు చెబుతాడు. సోము చెల్లెలు స్రవంతి చదువులో చాలా తెలివైన అమ్మాయి. అన్నకు చదువు విలువ ఎన్నోసార్లు చెప్పి చూసింది. అయినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు అయ్యేది.
సంక్రాంతి సెలవుల్లో సోము గాలిపటం ఎగుర వేస్తున్నాడు. చాలాసేపు ఎగుర వేశాడు. మరొక తుంటరి పిల్లవాడు గాలిపటం ఎగురవేస్తూ సోమూ గాలిపటం దారానికి మెలివేశాడు. సోము గాలిపటం తెగిపోయింది. అది చాలా ఖరీదైన గాలిపటం. ఎంత వెదకినా సోమూకు దొరకలేదు. సోమూ చాలా విచారంగా ఉన్నాడు. ఏడుపు ఒక్కటే తక్కువ. చాలా దిగులుగా కూర్చున్నాడు.
ఇంతలో సోము క్లాస్ మేట్ అపర్ణ అక్కడకు వచ్చింది. సోమూ దిగులుగా ఉన్న కారణం తెలుసుకుంది. "నువ్వు ఎంతో ఖరీదు పెట్టి కొన్న గాలిపటం నీకు దొరకకుండా పోయిందని నువ్వు బాధ పడుతున్నావు. నిన్ను 13 యేళ్లుగా పెంచుతూ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులను బాధ పెడుతూ, వారికి పూర్తిగా అందకుండా పోయినావు. నిన్ను కన్న తల్లిదండ్రులు నీ గురించి ఎంత బాధ పడుతున్నారో ఆలోచించు." అన్నది అపర్ణ. సోము ఆలోచనలో పడ్డాడు. సిగ్గుతో తల దించుకున్నాడు. ఇంటి పట్టునే ఉంటూ చదువుకుంటున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి