(డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు
నిజమైన ఘనమైన శాశ్వత నివాళి)
అంటరానివాడు...
ఎవరూ వెంటరానివాడు...
ఒంటెలా ఒంటరివాడని...
అవమానాల అగ్నిలో కాల్చినా...
చేసిన "జ్ఞాన తపస్సు"...
"రక్తంతో వ్రాసిన రాజ్యాంగం"
"తీర్చింది తల్లి భారతమాత ఋణాన్ని..!
మనకు స్వాతంత్ర్యం వచ్చి
ఎన్నో దశాబ్దాలు గడిచినా నేటి
ప్రభుత్వాల సుపరిపాలనకు...
మార్గదర్శిగా నిలిచింది "అంబేద్కర్ "రాజ్యాంగం" అందరికీ ఓ రక్షణకవచమే".!
సిరాతో చుక్కలతో కాదు...
తన సున్నితమైన హృదయం
నుంచి ఊరిన రక్తపు ధారలతో
తన కలల రాజ్యాంగాన్ని లిఖించిన
"జ్ఞానజ్యోతి"...డాక్టర్ బిఆర్ అంబేద్కర్..!
పాశ్చాత్య దేశాలు
యుద్ధాలతో దద్ధరిల్లిపోతుంటే...
బాంబుల బీభత్సానికి పిల్లలు
వృద్దులు మహిళలు బలైపోతుంటే...
ఎటు చూసినా రాజ్య కాంక్షే...
రక్తపుటేరులే...రోదనలే...వేదనలే...
ఆర్తనాదాలే...హాహాకారాలే ఆకలికేకలే...
కానీ మన వేదభూమి
ఒక "శాంతి సింధువే"...
దానికి మూల పురుషుడు
"మానవహక్కుల శిల్పి"...
"రాజ్యాంగ శిల్పకారుడు"...
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి