పల్లెలో ఒకనాటి పట్టపు రాణి. :- డాక్టర్ సి వసుంధర చెన్నై.
అనగనగా పల్లెటూరు
ఆ ఊరికి అందాలు 
అరుగులనే మహారాజులు.

వీధి అరుగు మీద జరుగు, పల్లె  రాజకీయాలు.

వీది అరుగు పిల్లల ఆటలకు, ఆట పట్టు

బాటసారి బడలిక తీర్చే, మెత్తని పడక వీధి అరుగు.

రాత్రిపూట రచ్చబండ దగ్గరున్న
రావి చెట్టు, పక్షులకు 
పడకటిల్లు.
 
నాలుగు వీధుల కూడలిలో నేనే
"న్యాయస్థానాన్నీ 
అంటున్న, పల్లె
సుప్రీం కోర్ట్, వీధి
అరుగు.
 
అప్పుడప్పుడు ఆడవారి ముచ్చట్లతో
విడరాని బంధమున్న వీధిఆరుగు.
 
వీధికే కాదు  ఇళ్లకు కూడాఆరుగు 
ముచ్చటైన మురువు.
 
వీధి గేటుకు
ఇరువైపులా ద్వారపాలకులు, చిన్న అరుగుల జంట.

"ఇంటింటా నేనుంటా,వీధికి  అందంగా నిలిచుంటా" అంటున్న అరుగుకు
 నేడు అడ్రసే లేదు.
 నాగరికత ప్రవాహంలో నాటి వైభవాలకు నామరూపాలు సున్నా. 
వాటి నామ జపం
ఆక్కడక్కడ వింటున్నా.

కామెంట్‌లు
Srigiri Nilayam చెప్పారు…
బాగుంది !!