అక్షరం....! (నానీలు ): - కోరాడ నరసింహా రావు !
అక్షరాలే
  ఆయుధాలై నాయి
    ఘన విజయం
      వరించి వచ్చింది !

అక్షరాలుచదివి
   విషయాలు గ్రహించి
      వివేకంతో....
     ఆనందంగా బ్రతుకు !

అక్షరాలకున్న శక్తి
 ఆయుధాలకు లేదు 
   ఇది చరిత్ర చెప్పిన
    సత్యం !

శబ్ధానికి  స్థిరత్వం 
  అక్షరాలతోనే సాధ్యం
   జ్ఞాన వారదులు
    అక్షరాలు...!

చదువుతో సంస్కారం
  విజ్ఞానం.....వికాసం
    సుఖమయం 
     ఆనంద జీవితం!

కామెంట్‌లు