గురు హస్త కమలములచే
అక్షరాలు దిద్దిస్తూ
సుహిత నవనీతం లాంటి
పాఠాల మధురాలు వినిపిస్తూ
విద్యార్థుల మదికి
అక్షరాల పదునుపెట్టి
పునాదులు వేస్తూ
పురోగతికి పాటుపడుతూ
మానవీయ విలువలు నేర్పి
భవితకు మార్గం చూపే
వెలుగు వెన్నెల కాంతులు.
అమృత హస్తాలతో అక్షర
కుసుమాలకు బీజాన్నివేస్తూ
పుస్తకాల్లో ముద్రించిన
పాఠాలే కాకుండా
అచ్చు వేయని అనుభవ పాఠాలు.
జ్ఞాన సంపదల గనిని
మదిలో నాటించే
మహిలో వెలసిన
మహిమాన్విత జ్యోతులు.
సుద్దముక్కల్ని అరగదీస్తూ
జీవితాంతం తాముకరుగుతూ
చేతిలోని సుద్ద ముక్కలతో
మట్టిముద్దలాంటి పసి బాలల్ని
అందమొలికె సౌందర్య శిల్పాలుగా
మార్చే మహనీయులు.
పాఠశాల నాలుగు గోడల మధ్య
పాఠ్యాంశ నైపుణ్యాల
దీప్తులు వెలిగిస్తూ
ప్రతిభను వెలికి తీసే మహోన్నతులు.
నీతి నిజాయితీ అనేఉలితో
తప్పులను ఖండిస్తూ
అక్షర నక్షత్రాలను
విద్యార్థికి అనువణువున
వెలిగించే విజ్ఞాన జ్యోతులు.
ఉపాధ్యాయులుమనఉపాధ్యాయులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి