దేశమంటే. మనుషులేనా....!:- కోరాడ నరసింహా రావు !
పల్లవి :-
 దేశమంటే.....దేశమంటే...
 దేశమంటే మనుషులేనా..
 మట్టి,చెట్టు, నదీ,నగములు...పశువులూ పక్షులు...  
దేశ మంటే మనుషులేనా!!
చరణం :-
 దేశమంటే ....కులము కాదు... దేశమంటే మతముకాదు ...కేవలం ఒక భాష కాదు...
  దేశమంటే...భిన్నత్వంలో ఏకత్వం...వైవిధ్యం లో సమన్వయం...!!
"దేశమంటే మనుషులేనా"
చరణం :-
 దేశమంటే సంస్కృతి...
  దేశమంటే సాంప్రదాయం
   దేశ మంటే సహజీవనం
  దేశమంటే సమైక్యం...!
  దేశమంటే కాదు స్వార్ధం 
  దేశమంటే త్యాగమోయ్!
 దేశమంటే కాదు ద్వేషం 
   దేశమంటే ప్రేమ మయ మోయ్...!
   దీనజనుల సేవ కోసమే దేశము...
   దేశమంటే కొందరే కాదు దేశమంటే అందరూ...
 సమ న్యాయం ,సమ ధర్మం , ఇదే కదా దేశము !
 ఇదే ఇదే దేశము...!!
     "దేశమంటే మనుషులేనా..."
     *****

కామెంట్‌లు