చిక్కులు మొక్కులతో తీరితే
చుక్కలు కోసుకోమా?
బదులు తెలియదని అంటే
ప్రశ్నలు ఎదురవకపోతాయా?
కలిగిన కల్లోలం వల్ల అల్లాడితే....
కోరిన తీరం దొరికేనా?
తల్లడిల్లినా తట్టుకోక పోతే
నడిచే దూరం తరిగేనా?
సంతోషం కలిగిందనే సంబరం
సదా మనతోనే నిలిచేనా?
సంఘర్షణలు సిద్ధం అయితే
సదా సర్దుకోడం కుదిరేనా?
సమస్యల తాకిడి తీవ్రమయితే
సహనం మనసున నిలిచేనా?
కలతలు చీకటిలా కమ్ముకువస్తే
కలలు చెదరక నిలిచేనా?
నిత్యం పోరాటం తప్పనిసరైతే
సత్యం బోధ పడకపోయేనా?
రెక్కలు ఆడేవరకే పరుగైనా
పయనమైనా....
అలసి ఆగిపోయాక
అంతరంగ మధనమే!
గడచిపోక కలకాలం నిలవదు
వేడుకైనా వేదనైనా..
ఆశ చిగురు మాయకుండా
రేపటి వెలుగు కోసం వేచిచూడడమే
జీవితం
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి