సముద్ర జీవాల అద్భుత ప్రపంచం :- -ఎస్.వి రమణా చార్య,జర్నలిస్ట్



 బాల్టిమోర్ నేషనల్ ఆక్వెరియం

  అమెరికాలోని మేరిలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరం లో ఉంది ఈ నేషనల్ ఆక్వెరియం. 1981లో ఇన్నర్ హార్బర్ లో ఈ ఆక్వెరియంను ప్రారంభించారు. ప్రపంచంలోని గొప్ప ఆక్వెరియంలో ఇది ఒకటి.ఇందులో 1700 సముద్ర జీవులు,750 జాతులకు చెందిన జలచరాలు మనకు కనిపిస్తాయి.పిల్లల నుంచి పెద్దల వరకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది ఈ ఆక్వెరియం సముద్ర జీవులను దగ్గరగా చూడాలనుకునే వారికి ఇది చక్కని సందర్శన ప్రాంతం.
   ఈ ఆక్వెరియం బయటి నుంచి చూస్తే ఓ పెద్ద ఆకాశహార్మ్యం గా కనపడుతుంది.ఇందులో ప్రతీ అంతస్తు లో విభిన్నంగా కనిపించే సముద్ర జీవులు,చేపలు, జెల్లి ఫిష్,డాల్ఫిన్లు, షార్కులు, ఫామ్డర్స్,  తాబేళ్లు వందల రకాల రంగు రంగుల చేపలు,మొసళ్ళు వందల గ్యాలన్లు నింపిన నీటిలో ఈత కొడుతూ ఉండడం ఓ విచిత్రంగా అనిపిస్తుంది.
  రెయిన్ డోమ్…ఇది తేమతో నిండిన ఫారెస్ట్.ఇందులో వివిధ రకాల పక్షులు,తాబేళ్లు,వివిధ రకాల చిలుకలు ఉన్నాయి.
  ఆస్ట్రేలియా వైల్డ్ ఎక్స్ట్రీమ్…ఇందులో ఆస్ట్రేలియా లో కనిపించే తుఫాన్ వ్యవస్థ,సముద్ర జీవులు,తేమలో నివసించే పాములు పలు అరుదైన జీవులు,రంగు రంగుల కప్పలు కనపడతాయి.
  డాల్ఫిన్ పావిలియన్…ఇది డాల్ఫిన్ల కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్థలం.ఇందులో వివిధ రకాల డాలిఫిన్లు చేసే విన్యాసాలు వాటి సంభాషణలు మనను మంత్ర ముగ్ధులను చేస్తాయి. 
    ఈ పెద్ద ఆక్వెరియం మనకు శాస్త్రీయ విజ్ఞానం,పర్యావరణ అవగాహన,సముద్ర జీవులపై అవగాహన,ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు,సముద్ర కాలుష్యం ప్రచారం,తీర ప్రాంత శుభ్రత,వాతావరణ మార్పులపై అవగాహన తదితర అంశాలపై మనకు చక్కని  హితబోధను చేస్తుంది. అలాగే భవిష్యత్ తరాలకు మన ప్రకృతి సంపదను ఎలా కాపాడుకోవాలో తెలియ పరుస్తుంది. ప్రతీ సంవత్సరం లక్షలాదిమంది సందర్శించే ఈ నేషనల్ ఆక్వెరియం కుటుంబ సమేతంగా చూడతగ్గ చక్కటి ప్రదేశం.

కామెంట్‌లు